News January 22, 2025

SKLM: ‘పెండింగ్ కేసులు వేగవంతం చేయాలి’

image

అపరిష్కృతంగా ఉన్న (క్రైమ్ అగైనెస్ట్) మహిళలు, చిన్నారులపై జరిగే కేసులు, హిట్ అండ్ రన్ కేసులపై దృష్టి కేంద్రీకరించి, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఎస్పీ శ్రీ కేవీ.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ వెల్లడించారు.

Similar News

News January 23, 2025

బొగాబొంద గ్రామంలో అత్యంత విషపూరితమైన పాము

image

మందస మండలం బొగాబంద గ్రామంలో అత్యంత విషపూరితమైన రణపస పాము కనిపించడం కలకలం రేపింది. స్థానికులు దానిని కొట్టి చంపారు. ఇది కరిస్తే కొద్ది రోజులకు శరీరంపై నల్ల, బంగారం వర్ణంలో మచ్చలు వస్తాయని, ఆపై శరీరం ముక్కలుగా రాలిపోతుందని స్థానికులు తెలిపారు. నల్లటి మచ్చలతో భయం గొలిపేలా ఉండే ఈ పాము శాస్త్రీయ నామం ‘బంగారస్ ఫాసియాటస్’.

News January 23, 2025

జి.సిగడాం: అంత్యక్రియలకు ఏర్పాటు.. అంతలో ట్విస్ట్

image

మండలంలోని సీతంపేటకి చెందిన ధర్మవరపు అప్పారావు(85) అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే రోగం నయం కాకపోవడంతో బుధవారం హాస్పిటల్ నుంచి గ్రామానికి అంబులెన్స్ లో తీసుకొస్తుండగా చలనం లేకపోవడంతో అప్పారావు మృతి చెందినట్లు బంధువులు భావించారు. ఆపై అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా ఆయన లేచి కూర్చోవడంతో అంతా షాకయ్యారు. ఆయన ఇంకా బతికే ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందించారు.

News January 23, 2025

SKLM: గణతంత్ర దినోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు

image

76వ భారత గణతంత్ర దినోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ ఆదివారం ఉదయం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైందని ఆయన చెప్పారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎస్పీ కెవీ.మహేశ్వర్ రెడ్డితో కలసి వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.