News April 15, 2025
SKLM: పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, పరిపాలనాపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో భూ పరిపాలన, తాగునీటి సరఫరా, ఐసీడీఎస్, గ్రామ సచివాలయాల పనితీరు వంటి కీలక అంశాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News April 24, 2025
నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ త్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది . దీనిలో భాగంగా నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గానూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 27 నుంచి మే 20వ తేదీలోపు ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
News April 24, 2025
ఉగ్రదాడిలో మన సిక్కోలు వాసి మృతి

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిలో సిక్కోలు వాసి మృతి చెందాడు. అతని కుటుంబం శ్రీకాకుళంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసముంటోంది. SBIలో ఉద్యోగమొచ్చాక శ్రీకాకుళం నుంచి వెళ్లి విజయనగరంతో పాటు పలు ప్రాంతాల్లో చేశారు. బ్రాంచ్ మేనేజర్‌గా ప్రమోషన్ పొంది రిటైర్డ్ అయ్యారు. కొన్నేళ్ల కిందట విశాఖలో స్థిర పడ్డారు. ఈనెల 18న మరో మూడు రిటైర్డ్ ఉద్యోగుల ఫ్యామిలీలతో కలిసి పర్యాటకానికి వెళ్లి హతులయ్యారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన సిక్కోలు ఆణిముత్యాలు

నేడు విడుదలైన SSC ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. 550 దాటిన మార్కుల్లో అమ్మాయిలదే పైచేయి. లావేరుకు చెందిన హరిత 600కి 592 మార్కులు వచ్చాయి. పలు మండలాల్లో ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్ ఎన్ పేట- 569( జాహ్నవి) , టెక్కలి- 577( లావణ్య), లావేరు-578( కుసుమ శ్రీ), రణస్థలం – 590(ఝాన్సీ) పది ఫలితాల్లో అదరగొట్టారు.