News April 14, 2025
SKLM: ప్రజా ఫిర్యాదుల నమోదు రేపు రద్దు

శ్రీకాకుళంలోని జడ్పీ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక రేపు సోమవారం నిర్వహించడం లేదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేశామని చెప్పారు. ప్రజలంతా గమనించాలని కోరారు.
Similar News
News December 10, 2025
శ్రీకాకుళం: ‘లక్ష్యాల సాధనలో ఆయా శాఖలు వేగం పెంచాలి’

ప్రభుత్వ శాఖల పనితీరులో వేగం పెంచి, కీలక పనితీరు సూచికలు ఆధారంగా లక్ష్యాలను సమయపాలనతో పూర్తి చేయాలని
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన శాఖల వారీగా సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. కేపీఐ ఆధారంగానే శాఖల పనితీరు మూల్యాంకనం జరుగుతుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి తావులేదన్నారు.
News December 10, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

✦శ్రీకాకుళం: సిక్కోలులో పెరిగిన చలితీవ్రత
✦విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్సీ నర్తు
✦కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూములు ఇవ్వలేం: గునిపల్లి గ్రామస్థులు
✦టెక్కలి హైవే పై ఆక్సిడెంట్.. తప్పిన ప్రమాదం
✦ఎచ్చెర్లలో అగ్నిప్రమాదం
✦కంచిలి: లారీ ఢీకొని యువకుడు స్పాట్ డెడ్.
✦ఇండిగో సంక్షోభంపై మాట్లాడిన కేంద్ర మంత్రి కింజరాపు
✦నందిగాం: గ్యాస్ అందక వినియోగదారుల ఇక్కట్లు
News December 9, 2025
శ్రీకాకుళం: ఏపీ టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

శ్రీకాకుళం, బరంపూర్ గంజాం ఒడిశాలో జరగనున్న ఏపీ టెట్-2025 కంప్యూటర్ పరీక్షకు ఏడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం పదివేల 499 మంది అభ్యర్థులు హాజరవుతారని డీఈవో రవి బాబు మంగళవారం తెలిపారు. ఈ పరీక్షను ఈ నెల 10 నుంచి 21 వరకు రెండు పూటలు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 9221 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు MEOలను డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించారన్నారు.


