News November 30, 2024

SKLM: ప్రతిభ కనబరిచిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు 

image

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో గంజాయి పట్టివేత, ప్రాపర్టీ నేరాలు చేదనా, తదితర అంశాలపై చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన వారికి ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి చేతులు మీదుగా ప్రశంస పత్రాలను ప్రదానం చేసి ప్రశంసించారు. అదనపు ఎస్పీ కెవి రమణ ఉన్నారు.

Similar News

News December 3, 2024

శ్రీకాకుళం: ల్యాబ్ టెక్నీషియన్ గోండు మురళి సస్పెన్షన్

image

ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై ఏసీబీకి చిక్కిన ల్యాబ్ టెక్నీషియన్ గొండు మురళిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లుగా జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి కల్యాణ్ బాబు ప్రకటించారు.  బుడితి CHCలో పని చేస్తున్న మురళీ ఇంటిపై ఇటీవల ACB దాడి చేసింది. రూ.50 కోట్ల అక్రమాస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసింది. కోర్టు ఆయనకు DEC 12 వరకు రిమాండ్ విధించింది. ఈయన గతంలో ధర్మాన కృష్ణదాస్ వద్ద పీఏగా పని చేశారు.

News December 3, 2024

SKLM: అధైర్యం వద్దు.. అండగా ఉంటాం: మంత్రి

image

పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి, యాజమాన్యాల చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా కల్పించారు. బాధితులందరినీ స్వదేశానికి తీసుకు వచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, నందిగాం, ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దాదాపు 30 మంది సౌదీ వలస వెళ్లి చిక్కుకున్న విషయం తెలిసిందే.

News December 3, 2024

శ్రీకాకుళం: ఈ నెల 9 వరకు మార్పులు, చేర్పులకు అవకాశం

image

శ్రీకాకుళంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3,906 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ముసాయిదా ఓటర్లు డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించినన్నారు. అనంతరం మార్పులు, చేర్పులకు ఈనెల 9వ తేదీన www.coeandhra.nic.in వెబ్‌సైట్‌లో కాని, సంబంధిత ఓటర్ల నమోదు అధికారికిగాని సంప్రదించి దరఖాస్తులను సమర్పించవచ్చు.