News March 18, 2025
SKLM: ప్రభుత్వ ఉద్యోగులకు కంప్యూటర్ శిక్షణ

ప్రభుత్వ శాఖల నుంచి ఇద్దరు లేదా ముగ్గురుకి మార్చి 18 నుంచి 22 వరకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. సోమవారం జడ్పీ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల నుంచి ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసి సత్వరమే అందజేయాలన్నారు. కంప్యూటర్ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎక్సెల్ షీట్స్, అడ్వాన్స్ టూల్స్‌పై శిక్షణ ఇస్తామన్నారు.
Similar News
News March 18, 2025
ఇచ్ఛాపురం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు IlT, JAM ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. ఈ మేరకు మంగళవారం విడుదలైన ఆల్ ఇండియా IIT JAM, MSc కెమిస్ట్రీ ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు బాకేశ్వరి 467, గుడియా జ్యోతి 786, బి.పూజిత 1333 ర్యాంకులు సాధించారు. ఈ సంధర్భంగా ప్రిన్సిపల్ డా.రబిన్ కుమార్ పాడి ద్వారా కెమిస్ట్రీ లెక్చరర్ శివకుమార్ విద్యార్థులకు రూ.12 వేల నగదు బహుమతి అందించారు.
News March 18, 2025
రాజకీయ పార్టీలతో శ్రీకాకుళం డీఆర్‌వో సమీక్ష

శ్రీకాకుళం నగరంలోని కలెక్టరేట్‌లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బూత్ స్థాయి అధికారులు నియామకాలు, పోలింగ్ బూత్‌లకు సంబంధించి అంశాలపై చర్చించి పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు, తదితర వాటిపై సమీక్షించారు. అనంతరం పలు సూచనలు చేశారు.
News March 18, 2025
ఎచ్చెర్లలో భార్య హత్య .. లొంగిపోయిన భర్త

ఎచ్చెర్ల మండలం ఎస్ఎస్ఆర్ పురం గ్రామానికి చెందిన గాలి నాగమ్మ (45)ను ఆమె భర్త గాలి అప్పలరెడ్డి సోమవారం రాత్రి కత్తితో నరికి హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం భార్యభర్తలిద్దరూ కలిసి ఉదయం కూలి పనికెళ్లారు. తర్వాత ఇంటికి వచ్చాక ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ పడ్డారు. మద్యం మత్తులో ఉన్న భర్త కత్తితో హత్య చేశాడు. అనంతరం అప్పలరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు.ఘర్షణకు కారణం తెలియాలి.