News March 20, 2025
SKLM: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు

జి.సిగడాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చెసుకుంటానని చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం అబార్షన్ చేయించాడు. వివాహం చేసుకోవాలని అడిగితే ససేమిరా అన్నాడు. మరోక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సే మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 28, 2025
SLM: పక్షుల రక్షణకు విద్యార్థుల వినూత్న ఆలోచన

పక్షుల రక్షణకు విద్యార్థులు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బూరగాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల, గ్రామాలలో పక్షుల కోసం ప్రత్యేకంగా తొట్టెలు, కొబ్బరి చిప్పల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎండకు స్పృహ తప్పి పడిపోయిన పక్షికి విద్యార్థులు నీరు తాగించి రక్షించారు. దీంతో పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
News March 28, 2025
శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్‌ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు ఏప్రిల్ సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరతాయని వివరించారు.
News March 28, 2025
SKLM: పది పరీక్షలకు 179 మంది గైర్హాజరు- డీఈఓ

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 179 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య శుక్రవారం తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 134 మంది, డిస్ట్‌న్స్ విభాగంలో 45 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని వివరించారు. వేసవి దృష్ట్యా త్రాగునీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.