News October 17, 2024

SKLM: బాలికకు గర్భం.. యువకుడిపై కేసు 

image

బాలికను మోసం చేసిన ఓ యువకుడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. సారవకోట మండలానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో తన గ్రామంలోని బాలికకు దగ్గరయ్యాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భం దాల్చినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో, అత్యాచారం, అట్రాసిటీ కేసులు నమోదు చేశామని SI అనిల్ కుమార్ తెలిపారు.

Similar News

News January 9, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

✮ రేపు అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం
✮శ్రీకాకుళం: కలెక్టర్ కు 108 ఉద్యోగుల సమ్మె నోటీసు
✮సోంపేట: గంజాయితో పోలీసులకు పట్టుబడిన ఒడిశా వాసి
✮శ్రీకాకుళం: ప్రయాణీకులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
✮నరసన్నపేట: Way2News కథనానికి స్పందన..వ్యర్థాలు తొలగింపు
✮కొత్తూరు మండల ఏపీఎంగా రవిరాజు
✮టెక్కలి: అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే చర్య
✮మందస: పశువుల తరలింపును అడ్డుకున్న పోలీసులు

News January 8, 2026

‘నూతన సమీకృత కలెక్టర్ భవన నిర్మాణాలు పూర్తి చేయాలి’

image

నూతన సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు జరిగిన పనులను స్వయంగా ఆయన గురువారం పరిశీలించారు. ఇంత వరకు పూర్తికాని నిర్మాణాల గురించి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుగుణాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తి కట్టడాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.

News January 8, 2026

ట్రాఫిక్ సమస్య రానీయకూడదు: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

image

రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రానీయకూడదని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పరిసరాలను పరిశీలించారు. 80 అడుగుల రహదారిలో మిల్లు జంక్షన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలాలను గుర్తించారు. భక్తులకు దర్శనాలకు రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సిబ్బందికి సూచించారు. రద్దీ నియంత్రణకు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.