News October 17, 2024

SKLM: బాలికకు గర్భం.. యువకుడిపై కేసు 

image

బాలికను మోసం చేసిన ఓ యువకుడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. సారవకోట మండలానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో తన గ్రామంలోని బాలికకు దగ్గరయ్యాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భం దాల్చినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో, అత్యాచారం, అట్రాసిటీ కేసులు నమోదు చేశామని SI అనిల్ కుమార్ తెలిపారు.

Similar News

News November 4, 2024

టెక్కలి: దేశంలోనే అతిపెద్ద శివలింగం

image

శివలింగాలలో అతి పెద్దది జిల్లాలోని టెక్కలి మండలం రావివలస గ్రామంలో ఉంది. దేశంలోనే పెద్దదైన ఈ శివలింగం మన రాష్ట్రంలో ఉండడం విశేషం. రావివలస గ్రామంలో వెలిసిన శ్రీ ఎండల మల్లికార్జునస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదిగా మారింది. దాని ఎత్తు 55 అడుగులు, అందువల్ల ఈ ఎండల మల్లన్నకు గోపురం ఉండదు. నిరంతరం మల్లన్న ఎండలోనే ఉంటాడు కాబట్టి ఆ శివలింగానికి ఎండల మల్లికార్జునస్వామి అనే పేరు ప్రసిద్ధి చెందింది. 

News November 4, 2024

రావివలస: రామాయణ చిత్రానికి అవార్డు

image

రావివలస ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు నారాయణ మూర్తి గీసిన చిత్రాన్ని అవార్డు వరించింది. హైదరాబాద్ కాసుల చిత్రకళా అకాడమీ ఇటీవల ఆన్‌లైన్లో నిర్వహించిన రామాయణం ఇతివృత్త చిత్ర పోటీల్లో ఈ చిత్రం ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తం 2,275 మంది పోటీలో పాల్గొనగా.. ఈ చిత్రం ద్వితీయ స్థానం పొందినట్లు అకాడమీ నిర్వాహకులు నారాయణ మూర్తికి ప్రశంసాపత్రం, అభినందనలేఖ పంపినట్లు ఆయన తెలిపారు.

News November 3, 2024

SKLM: ఇరిగేషన్.. ఇండస్ట్రీ.. ఇదే మా నినాదం: మంత్రి

image

వలసలను నివారించడమే ధ్యేయంగా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట పోర్టులను అనుసంధానిస్తూ కోస్టల్ కారిడార్ నిర్మాణానికి డిపిఆర్‌లు రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లా అభివృద్ధిపై గతంలో ఏ సీఎం కూడా జిల్లా అధికారులతో రివ్యూ చేసింది లేదన్నారు.