News December 9, 2024

SKLM: మంత్రి నాదెండ్లను కలిసిన జనసేన నేతలు

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను విజయనగరం జిల్లాలోని భోగాపురం రిసార్ట్‌లో సోమవారం శ్రీకాకుళం జనసేన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి పీసీనీ చంద్రమోహన్, జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనువాసరావు, తాళాబత్తుల పైడిరాజు, చిట్టి భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

Similar News

News November 8, 2025

కనుమరుగైన బాలి యాత్ర..పున:ప్రారంభం వెనక కథ ఇదే

image

శ్రీముఖలింగంలో రేపు జరిగే బాలియాత్రకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 5 వేల ఏళ్ల క్రితం వదిలేసిన యాత్రను ఇటీవల ప్రారంభించారు. మహానది-గోదావరి వరకు గల కళింగాంధ్రాను ఖౌరవేలుడు పరిపాలించాడు. ఆయన కాలంలో శ్రీముఖలింగం ఆలయ సమీపాన వంశధార నది నుంచి వర్తకులు పంటలతో ఇండోనేషియాలో బాలికి వెళ్లేవారు. వారు క్షేమంగా రావాలని కార్తీక మాసంలో అరటి తెప్పల దీపాన్ని కుటుంబీకులు నదిలో విడిచిపెట్టడమే యాత్ర వృత్తాంతం.

News November 8, 2025

నరసన్నపేట: పంచలోహ విగ్రహాల అప్పగింత

image

నరసన్నపేటలోని సిద్ధాశ్రమంలో ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ నిందితుడి వద్ద సమాచారం రాబట్టి, విగ్రహాలను సిద్ధాశ్రమ నిర్వాహకులకు శుక్రవారం రాత్రి అందజేశారు.

News November 8, 2025

SKLM: ‘క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

క్యాన్సర్ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని DMHO డాక్టర్ అనిత అన్నారు. శ్రీకాకుళం డీ ఎం‌అండ్‌హెచ్‌ఓ కార్యాలయం వద్ద అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వ్యాధి నివారణ కోసం శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలో మొదటి స్థానంలో జబ్బు గుండె వ్యాధి ఉండగా, రెండవ స్థానంలో క్యాన్సర్ వ్యాధి ఉందని ఆమె పేర్కొన్నారు.18 ఏళ్లు నిండిన వ్యక్తులకు ఇంటి వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారన్నారు.