News December 9, 2024
SKLM: మంత్రి నాదెండ్లను కలిసిన జనసేన నేతలు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను విజయనగరం జిల్లాలోని భోగాపురం రిసార్ట్‌లో సోమవారం శ్రీకాకుళం జనసేన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి పీసీనీ చంద్రమోహన్, జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనువాసరావు, తాళాబత్తుల పైడిరాజు, చిట్టి భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
Similar News
News January 20, 2025
శ్రీకాకుళం రథసప్తమి ఏర్పాట్లు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
రథసప్తమి సందర్భంగా చేస్తున్న అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం అరసవల్లి మిల్లి జంక్షన్, అరసవెల్లి రోడ్డు మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును తెలుసుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 20, 2025
కూటమి ప్రభుత్వంపై అక్కసుతో దుష్ప్రచారం: అచ్చెన్న
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొంత మంది వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం ఆర్థిక సహాయం అందించడంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఉక్కుకర్మాగారం ఊపిరి తీసింది మాజీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన విమర్శించారు.
News January 20, 2025
పాతపట్నం: ఇంట్లోకి చొరబడి.. వైసీపీ కార్యకర్తపై దాడి
పాతపట్నం మేజర్ పంచాయతీ దువ్వారి వీధికి చెందిన పెద్దింటి తిరుపతిరావు పై హత్య ప్రయత్నం జరిగింది. తిరుపతి నిద్రిస్తుండగా రాత్రి 3 గంటల సమయంలో (ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం) గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో మెడ పైన దాడి చేయడం జరిగింగి. తిరుపతిరావు ఓ పత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. వైసీపీ కార్యకర్తగా ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.