News October 15, 2024
SKLM: మద్యం షాపుల లాటరీలో ఆసక్తికర అంశాలు

జిల్లాలో మద్యం షాపుల లాటరీ విషయంలో కొన్ని ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. ➤సోంపేటకు చెందిన ఒక వ్యక్తి 45 దరఖాస్తులు చేయగా 1 దుకాణం వరించింది. ➤శ్రీకాకుళం నగరానికి చెందిన వైసీపీ నేత తన సన్నిహితులతో సిండికేట్‌గా ఏర్పడి 140 దరఖాస్తులు చేయగా 6 దుకాణాలు వచ్చాయి. ➤విజయనగరం జిల్లాకు చెందిన ఒక మిల్లరు జిల్లాలో 150 దరఖాస్తులు చేయగా కొన్ని దుకాణాలు వచ్చాయి. ➤నరసన్నపేట మహిళకు రెండు దుకాణాలు వచ్చాయి.
Similar News
News November 8, 2025
SKLM: ‘క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి’

క్యాన్సర్ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని DMHO డాక్టర్ అనిత అన్నారు. శ్రీకాకుళం డీ ఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం వద్ద అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వ్యాధి నివారణ కోసం శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలో మొదటి స్థానంలో జబ్బు గుండె వ్యాధి ఉండగా, రెండవ స్థానంలో క్యాన్సర్ వ్యాధి ఉందని ఆమె పేర్కొన్నారు.18 ఏళ్లు నిండిన వ్యక్తులకు ఇంటి వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారన్నారు.
News November 7, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

★బాలియాత్ర ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన
★జలుమూరు: జాబ్ మేళాలో 203 మంది ఎంపిక
★కాశీబుగ్గలో NCC విద్యార్థుల ర్యాలీ
★నిరుపేదలను ఆదుకోవడమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్
★పలాసలో కిడ్నాప్.. బాధితుడు ఏమన్నాడంటే ?
★ఎచ్చెర్ల: ఇష్టారీతిన మట్టి తరలింపు
★రణస్థలం: రహదారి లేక నరకం చూస్తున్నాం
★శ్రీకాకుళం: ప్రిన్సిపల్ వేధింపులతో చనిపోవాలనుకున్నా
★సోంపేట: అధ్వానంగా రోడ్లు..వాహనదారులకు తప్పని అవస్థలు
News November 7, 2025
SKLM: సెకండ్ సాటర్డే సెలవులు రద్దు

రానున్న ఏడాది ఫిబ్రవరి నెల వరకు సెకండ్ సాటర్డే సెలవులు ఉండవని డీఈవో కే.రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు యథావిధిగా జిల్లాలో పాఠశాలలు నడుస్తాయన్నారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా సెలవులను వీటి ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వచ్చాయని, విద్యాసంస్థలు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరారు.


