News October 15, 2024

SKLM: మద్యం షాపుల లాటరీలో ఆసక్తికర అంశాలు

image

జిల్లాలో మద్యం షాపుల లాటరీ విషయంలో కొన్ని ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. ➤సోంపేటకు చెందిన ఒక వ్యక్తి 45 దరఖాస్తులు చేయగా 1 దుకాణం వరించింది. ➤శ్రీకాకుళం నగరానికి చెందిన వైసీపీ నేత తన సన్నిహితులతో సిండికేట్‌గా ఏర్పడి 140 దరఖాస్తులు చేయగా 6 దుకాణాలు వచ్చాయి. ➤విజయనగరం జిల్లాకు చెందిన ఒక మిల్లరు జిల్లాలో 150 దరఖాస్తులు చేయగా కొన్ని దుకాణాలు వచ్చాయి. ➤నరసన్నపేట మహిళకు రెండు దుకాణాలు వచ్చాయి.

Similar News

News November 12, 2024

వంశధారకు రూ.63.50 కోట్ల కేటాయింపు

image

శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. అత్యధికంగా వంశధార ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులకు రూ.63.50 కోట్లు ప్రతిపాదించింది. మహేంద్ర తనయ నదిపై ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.35 కోట్లు కేటాయించింది. తోటపల్లి, నారాయణపురం ఆనకట్ట పనులకు రూ.32.84 కోట్లు ప్రకటించింది. వీటితో పాటు జిల్లాకు ప్రత్యేకంగా పోలీస్ బెటాలియన్ కేటాయించింది. కొత్తగా సైబర్ స్టేషన్ సైతం రానుంది.

News November 12, 2024

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో సిక్కోలు సత్తా 

image

రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య హ్యాండ్ బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు విజేతలుగా నిలిచారు. గత మూడు రోజులుగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన అండర్-19 బాలికల రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా బాలికల జట్టు ప్రథమస్థానం సొంతం చేసుకున్నారు. జట్టు కోచ్ మేనేజర్లుగా ఆర్.సతీష్రయుడు, జి.డిల్లీశ్వరరావు, రాజశేఖర్ వ్యవహారించారు.

News November 12, 2024

నేడు స్వర్ణకాంతులతో ఆదిత్యుని దర్శనం 

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో స్వామి వారి మూలవిరాట్ విగ్రహనికి మంగళవారం పూర్తిగా బంగారు ఆభరణాలతో అలంకరిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. నేడు కార్తీక శుద్ధ ఏకాదశి, రేపు ద్వాదశి కావడంతో ప్రత్యేక అలంకరణలో  దర్శన భాగ్యం కల్పిస్తామని ఆలయ డీసీ వై.భాద్రజీ వెల్లడించారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.