News November 29, 2024
SKLM: మాజీ పీఏ గోండు మురళికి రిమాండ్
అక్రమ ఆస్తుల కేసులో భాగంగా గురువారం నిర్వహించిన ఏసీబీ దాడుల్లో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పీఏ గోండు మురళిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనను అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించారు. కేసు పూర్వాపరాలు గుర్తించిన న్యాయస్థానం ఆయనకు వచ్చే నెల 12వ తేదీ వరకు రిమాండ్ ఇస్తూ తీర్పు ప్రకటించారు. ఈ మేరకు విశాఖ జైలుకు తరలించారు.
Similar News
News December 12, 2024
SKLM: చంద్రబాబు కృషి ఎంతో ఉంది: మంత్రి
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం హైదరాబాద్ శంషాబాద్లోని నోవాటెల్లో ఎయిర్ పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అప్పట్లో 5వేల ఎకరాల భూసేకరణ అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని తెలిపారు.
News December 11, 2024
SKLM: రోడ్డు పనులు వేగవంతం చేయాలి- రామ్మోహన్
పలాస నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ రహదారులకు సంబంధించి నౌపడ నుంచి బెండిగేట్ రహదారిని రెండు వరుసల రహదారిగా చేయాలని కోరుతూ మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో వీరు మర్యాదపూర్వకంగా కలిశారు. నరసన్నపేట-ఇచ్ఛాపురం వరకు ఉన్న జాతీయ రహదారి 6 లైన్లకు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు.
News December 11, 2024
శ్రీకాకుళం జిల్లా పేరు మార్పుపై మీరేమంటారు..?
శ్రీకాకుళం జిల్లాకు సర్దార్ గౌతు లచ్చన పేరు పెట్టాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రజాకవి, ఫ్రీడం ఫైటర్ గరిమెళ్ల సత్యనారాయణ పేరు తెరపైకి వచ్చింది. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో సిక్కోలుకు గరిమెళ్ల పేరు పెట్టాలని అరసం జిల్లా అధ్యక్షుడు నల్లి ధర్మరావు కోరారు. మరి ఎవరి పేరు అయితే జిల్లాకు పెట్టాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.