News August 5, 2024
SKLM: మీకోసంలో 172 అర్జీల స్వీకరణ

ప్రజలు సంతృప్తి చెందేలా, త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.అప్పారావు అన్నారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 172 అర్జీలను స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆర్డీఓ పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
శ్రీకాకుళం: ‘గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు’

ప్రభుత్వం గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. గ్రామ సచివాలయాల అడ్మినిస్ట్రేషన్కు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ ) వ్యవస్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం రాష్ట్రం యూనిట్ను వర్చువల్గా ప్రారంభిస్తున్నారు. శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ భాగం ఏర్పాటు చేశారు. డీడీఓగా అరుంధతి దేవిని నియమించారు. జిల్లాలో 657 గ్రామ సచివాలయాలు ఈ పరిధిలోకి వస్తాయి.
News December 4, 2025
‘శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల జాబితా సిద్ధం చేయాలి’

జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల జాబితాను వారం రోజుల్లో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దేవాదాయ శాఖ ఈఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఒక్కొక్క దేవాదాయ శాఖ ఈఓ పరిధిలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయి, వాటి చరిత్ర, పురాతనం నుంచి వస్తున్న జాతర చరిత్రలను సిద్ధం చేసి వారం రోజుల్లో జాబితా అందజేయాలన్నారు.
News December 4, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు అలర్ట్

రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇటీవల శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు అయ్యాయి. వీటిని రీ షెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ బుధవారం పేర్కొంది. హౌడా-సికింద్రాబాద్(12703), చెన్నై-హౌడా (12840) ఎక్స్ప్రెస్లు డిసెంబర్ 4, 8, 9, 10,11 తేదీల్లో నిర్ణీత సమయం కంటే 2 గంటలు ఆలస్యంగా నడుస్తాయని ఆ శాఖ జీఎం పరమేశ్వర్ తెలిపారు.


