News February 2, 2025

SKLM: రథసప్తమికి దర్శన టికెట్ల ఇచ్చే ప్రదేశాలు ఇవే .!

image

రథసప్తమి సందర్భంగా దర్శన టికెట్లను అందుబాటులో ఉంచామని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. రూ.100 దర్శన టికెట్లు: అరసవల్లి దేవాలయ ప్రాంగణంలోని కౌంటర్‌లో లభిస్తాయి. అరసవల్లి దేవాలయ ప్రాంగణంలోని కౌంటర్‌లోనే రూ.100 దర్శన టికెట్లు, రూ.300 దర్శన టికెట్లు, రూ. 500 క్షీరాభిషేకం టికెట్లు(ఇద్దరికి దర్శన అవకాశం) లభించనున్నాయన్నారు

Similar News

News February 16, 2025

టెక్కలి: యువకుడి బ్రెయిన్‌డెడ్.. అవయవదానం

image

టెక్కలి మండలం కిట్టాలపాడు గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం నల్లబొంతు గ్రామానికి చెందిన మామిడిపల్లి సతీష్ (24) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాగా అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు.. శనివారం యువకుడి నేత్రాలు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి వివిధ ఆసుపత్రులకు తరలించారు.

News February 16, 2025

శ్రీకాకుళంలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం..!

image

శ్రీకాకుళం జిల్లాకు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం వస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ఇది వరకూ ఈ కార్యాలయం బొబ్బిలిలో ఉండేదని చెప్పారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసేందుకు రాష్ర్ట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఎంతో ఉందని అన్నారు. రైతాంగానికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. 

News February 16, 2025

శ్రీకాకుళం: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

image

శ్రీకాకుళం నగరంలోని ఏపీ.ఎస్.ఆర్టీసీ డిపో 1 లో శనివారం రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్, డీఎస్పీ వివేకానంద పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రతా ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం శ్రీకాకుళం,టెక్కలి, పలాస డిపోలో ఎక్కువ కాలం ప్రమాద రహిత డ్రైవర్స్‌గా ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. 

error: Content is protected !!