News January 30, 2025
SKLM: రథసప్తమి పండగ .. టూరిజం బస్సు ఏర్పాటు

శ్రీ సూర్యనారాయణ స్వామి రాష్ట్ర పండగ రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో టూరిజం ప్యాకేజీలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. టూరిజం సంస్థ నేతృత్వంలో మినీబస్సు ఏర్పాటు చేశారన్నారు. శ్రీకూర్మం, మొగదలపాడు, సాలిహుండం, శ్రీముఖలింగం, రావివలస సర్క్యూట్ తిప్పిచూపిస్తారు. సన్‌రైజ్ హోటల్ రిసెప్షన్ వద్ద ఏపీ టూరిజం కౌంటర్ ఉందన్నారు. వ్యక్తికి రూ.750 ఉంటుందన్నారు.
Similar News
News July 7, 2025
శ్రీకాకుళంలో నేడు పీజీఆర్‌ఎస్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
News July 6, 2025
ఆమదాలవలస: పార్ట్ టైం పేరుతో వెట్టి చాకిరి తగదు

పార్ట్ టైం పేరుతో వీఆర్ఏలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని రాష్ట్ర వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు షేక్ బందిగీకి సాహెబ్ అన్నార. వీఆర్ఏ సంఘం 7వ జిల్లా మహాసభ ఆదివారం ఆమదాలవలసలో జరిగింది. వీఆర్ఏలు ఫుల్ టైం విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు.
News July 6, 2025
శ్రీకాకుళం: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలి

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల, స్కూల్ స్వీపర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. మెనూ ఛార్జీలు ఒక్కొక్క విద్యార్థికి కనీసం రూ.20/-లు ఇవ్వాలని కోరారు. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు.