News January 2, 2025
SKLM: రథసప్తమి వేడుకల కోసం నేడు భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ
అరసవల్లి రథసప్తమి మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భక్తుల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 10 గంటలకు భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షత వహించనున్నారు.
Similar News
News January 20, 2025
కూటమి ప్రభుత్వంపై అక్కసుతో దుష్ప్రచారం: అచ్చెన్న
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొంత మంది వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం ఆర్థిక సహాయం అందించడంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఉక్కుకర్మాగారం ఊపిరి తీసింది మాజీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన విమర్శించారు.
News January 20, 2025
పాతపట్నం: ఇంట్లోకి చొరబడి.. వైసీపీ కార్యకర్తపై దాడి
పాతపట్నం మేజర్ పంచాయతీ దువ్వారి వీధికి చెందిన పెద్దింటి తిరుపతిరావు పై హత్య ప్రయత్నం జరిగింది. తిరుపతి నిద్రిస్తుండగా రాత్రి 3 గంటల సమయంలో (ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం) గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో మెడ పైన దాడి చేయడం జరిగింగి. తిరుపతిరావు ఓ పత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. వైసీపీ కార్యకర్తగా ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 20, 2025
శ్రీకాకుళం: వివాహిత హత్య.. పరిశీలించిన ఎస్పీ
శ్రీకాకుళం రెండో పోలీసు స్టేషన్ పరిధిలో గల న్యూ కాలనీలో ఆదివారం రాత్రి సమయంలో పూజారి కళావతి అనే ఆమె హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి హత్య ప్రదేశాన్ని ఆదివారం అర్ధరాత్రి హుటాహుటిన సందర్శించి బాధితులతో హత్య ఘటనకు కారణాలు ఆరా తీశారు. అదేవిధంగా నేర ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు.