News September 11, 2024

SKLM: రాష్ట్ర పండుగగా కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర

image

కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొత్తమ్మతల్లి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ జాతర నిర్వహణ కోసం రూ.కోటి మంజూరు చేసింది. ఈ నిధులను అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం నుంచి సమకూర్చనున్నట్లు పేర్కొంది.

Similar News

News October 10, 2024

తెలంగాణ DSCలో కొర్లకోట యువతి సత్తా

image

ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన పేడాడ హిమ శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ పరీక్షలలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలో 9వ ర్యాంక్ సాధించింది. ఈమె తండ్రి ప్రభాకరరావు స్కూల్ అసిస్టెంట్‌గా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. తల్లి గృహిణి. హేమ శ్రీ ఎంపిక పట్ల తల్లిదండ్రులు గ్రామస్థులు అభినందనలు తెలిపాలి.

News October 10, 2024

శ్రీకాకుళం: భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

image

భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తహసీల్దార్లకు ఆదేశించారు. తహసీల్దార్లుతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ అర్జీలపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ఎలినేషన్స్ పైన మండలాల వారీగా ఆయన సమీక్షించారు. ఎలినేషన్స్ ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఎక్కడెక్కడ పెండింగ్‌లో ఉన్నది తెలుసుకోవాలని చెప్పారు.

News October 10, 2024

దువ్వాడ మీదుగా విజయవాడ – శ్రీకాకుళానికి ప్రత్యేక రైలు

image

దసరా రద్దీ దృష్ట్యా విజయవాడ – శ్రీకాకుళం రోడ్ మధ్య దువ్వాడ మీదుగా కొన్ని రోజుల పాటు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07215 ఈనెల 10, 11,12,14,15,16,17 తేదీల్లో విజయవాడలో రాత్రి 8 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం రోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలునంబర్ 07216 ఈనెల 10,11,12,13,15,16,17,18 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డులో ఉదయం 6.30కి బయలుదేరి విజయవాడ చేరుతుంది.