News September 14, 2024

SKLM: రిమ్స్‌లో నవజాత శిశువు మృతి

image

నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం అంగన్వాడీ కేంద్రం వద్ద మతిస్థిమితం లేని మహిళ అప్పాజీ ఈనెల 8వ తేదీన రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నెలల వయస్సు, బరువు తక్కువగా ఉన్న శిశువును శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.

Similar News

News November 4, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

➤పాపం పసి ప్రాణం.. పుట్టడమే శాపమా ?
➤శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్ కు 52 అర్జీలు
➤శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల పూజలు
➤గ్రామాల అభివృద్ధికి కూటమి కృషి: అచ్చెన్న, రామన్న
➤శ్రీకాకుళం: 80సార్లు అర్జీలిచ్చాం..అడుగు రోడ్డు వేయలేదు
➤దర్శనాలకు ఆటంకం లేకుండా చర్యలు: హిరమండలం ఎస్సై
➤ హామీ అమలుతో శ్రీకాకుళం జిల్లాలో 1,350 మందికి మేలు

News November 3, 2025

పాపం ‘పసి’ ప్రాణం.. పుట్టడమే శాపమా..?

image

శ్రీకాకుళంలోని అరసవిల్లి జంక్షన్ సమీప మురుగు కాలువలో సోమవారం ఓ శిశువు మృతదేహం కంటతడి పెట్టించింది. తల్లి ఒడిలో లాలన పొందాల్సిన పసికందు మురుగులో తేలుతూ కనిపించడంతో మాతృత్వానికి మచ్చ తెచ్చేలా ఉందని పలువురు వాపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హరికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. నాలాలో పడేశారా? వేరే కారాణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

News November 3, 2025

శ్రీకూర్మంలో బండి ఎక్కిన పడవ

image

గార(M) శ్రీకూర్మనాథ స్వామి ఆలయం సమీపంలో ఆదివారం పడవను పోలిన బండిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా వేటకు వెళ్లని మత్స్యకారులు నావలకు రిపేర్లు చేయించారు. సాయంత్రం పడవను నాటు బండిపై ఎక్కించుకొని తీసుకుని వెళ్లిన దృశ్యాన్ని చూసేయండి.