News February 3, 2025
SKLM: రేపు మధ్యాహ్నం వరకు డోనర్ పాసులు పంపిణీ

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి విరాళాలు సమర్పించిన దాతలకు రథసప్తమి రోజున దర్శనానికి డోనర్ పాసులతో అవకాశం కల్పించామని ఈవో భద్రాజి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సదరు డోనార్ పాస్‌లు ఇచ్చే ప్రక్రియ రేపు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆలయానికి విరాళం ఇచ్చిన దాతలు గమనించాలని కోరారు.
Similar News
News November 23, 2025
మావోయిస్టు కీలక నేతల్లో సిక్కోలు వాసులు

మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీ కీలక నేతల్లో సిక్కోలు వాసులు ఉన్నారు. గత కొద్ది నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో జిల్లాకు చెందిన నంబాళ్ల కేశవరావు మృతిచెందగా, తాజాగా మరేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో జిల్లాలోని బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు కీలకనేత మెట్టూరు జోగారావు(టెక్ శంకర్) మరణించారు. అదే ప్రాంతానికి చెందిన చెల్లూరు నారాయణరావు(సూరన్న) అజ్ఞాతంలో ఉన్నారు.
News November 23, 2025
నేడు శ్రీకాకుళం రానున్న విజయసాయిరెడ్డి

వైసీపీ ఓడిపోయిన అనంతరం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం వైసీపీ హయంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలు చేసిన ఆయన బీజేపీలో చేరతారని వార్తలొచ్చినా అది జరగలేదు. అప్పటి నుంచి స్తబ్దుగా ఉన్న ఆయన ఆదివారం శ్రీకాకుళంలో జరిగే రెడ్డిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన ఏం మాట్లాడతారోనని ఆసక్తి నెలకొంది.
News November 23, 2025
బెల్జియం అమ్మాయి.. సిక్కోలు అబ్బాయి.. కట్ చేస్తే!

బెల్జియం దేశానికి చెందిన యువతి శ్రీకాకుళానికి చెందిన యువకునికి ఘనంగా వివాహం జరిగింది. శ్రీకాకుళం హయాతి నగర్‌కు చెందిన యువకుడు శ్రీ రంగనాథ సాహిత్ బెల్జియంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తనతోపాటు పనిచేస్తున్న కెమిలీ మస్కర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో శ్రీకాకుళంలో శనివారం రాత్రి జరిగిన వివాహంతో వారిద్దరు ఒకటయ్యారు.


