News February 3, 2025
SKLM: రేపు మధ్యాహ్నం వరకు డోనర్ పాసులు పంపిణీ

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి విరాళాలు సమర్పించిన దాతలకు రథసప్తమి రోజున దర్శనానికి డోనర్ పాసులతో అవకాశం కల్పించామని ఈవో భద్రాజి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సదరు డోనార్ పాస్లు ఇచ్చే ప్రక్రియ రేపు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆలయానికి విరాళం ఇచ్చిన దాతలు గమనించాలని కోరారు.
Similar News
News February 13, 2025
వాసుదేవు పెరుమాళ్ బ్రహ్మోత్సవాలకు కలెక్టర్కు ఆహ్వానం

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసలో ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీ వాసుదేవుని పెరుమాళ్ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆలయ ప్రధాన అర్చకులతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో మందస గ్రామ పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు.
News February 12, 2025
శ్రీకాకుళం: మరణంలోనూ వీడని బంధం..!

యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో కానీ ఒకే రోజు వీరి వివాహం జరిగింది. మరణం కూడా ఒకేరోజు గంటల వ్యవధిలో సంభవించింది. ఒకేరోజు అనారోగ్యంతో బావ, బామ్మర్ది మృతి చెందిన విషాదకర సంఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. సార సోమేశ్వరరావు (58) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా, మరోవైపు కొర్రాయి నారాయణరావు (58) కూడా సోమేశ్వరరావు మృతి చెందిన కొన్ని గంటల్లోనే అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు.
News February 12, 2025
నందిగాం: హత్యకు గురైన తహశీల్దార్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

నందిగాం గ్రామానికి చెందిన రమణయ్య విశాఖపట్నంలో తహశీల్దారు విధులు నిర్వహిస్తూ గతేడాది ఫిబ్రవరి 2న హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్గా నియామక పత్రం అందించారు.