News March 28, 2025
SKLM: రైలు ప్రయాణికులకు శుభవార్త

పలాస, శ్రీకాకుళం మీదుగా హైదరాబాద్(HYB)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07165 HYB- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News July 11, 2025
ఎచ్చెర్ల: దారుణంగా హత్య చేశారు

ఎచ్చెర్ల మండలంలో గోపి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం ఫరీద్ పేట గ్రామ జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గోపిపై అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 11, 2025
సారవకోట: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో..ఒకరి మృతి

సారవకోట(M) కృష్ణాపురం సమీపంలో రహదారిపై గురువారం ఆగి ఉన్న లారీను వెనక నుంచి ఆటో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అమ్మనమ్మ (56) మృతి చెందింది. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News July 11, 2025
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

✯ మెళియాపుట్టి: విద్యుత్ షాక్ తో 5వ తరగతి విద్యార్థి మృతి
✯మందసలో అధికారులను అడ్డుకున్న రైతులు
✯ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రవికుమార్
✯ సారవకోట: లారీని ఢీకొన్న ఆటో.. ఐదుగురికి తీవ్ర గాయాలు
✯ కళింగపట్నంలో పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
✯ పలాస: గంజాయితో ముగ్గురు అరెస్ట్
✯ కంచిలి: అధ్వానంగా ఆసుపత్రి పరిసరాలు
✯ టెక్కలి: శాకాంబరీదేవిగా శివదుర్గ అమ్మవారు