News August 28, 2024

SKLM: రైల్వే ప్రయాణికుడికి నష్టపరిహారం చెల్లించండి

image

శ్రీకాకుళం నగరానికి చెందిన రామ్మోహన్రావు ఈ ఏడాది జనవరిలో విజయవాడ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్ ప్రెస్లో టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. రైల్వే కేటరింగ్ ద్వారా విశాఖలో ఆహారం తీసుకునేందుకు ఆన్లైన్లో రూ.263 చెల్లించారు. కాని వారు ఆహారాన్ని అందించలేదు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించగా బాధితుడికి నష్టపరిహారంగా రూ.25 వేలు, ఖర్చులకు రూ.10 వేలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు.

Similar News

News September 9, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: ఎస్పీ

image

శ్రీకాకుళంలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత కారణంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 8, 2024

వంశధార, నాగావళి నదులకు వరద పెరిగే అవకాశం ఉంది: సీఎంఓ

image

శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం రాత్రి సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారులను కోరారు. జిల్లా ఉన్నతాధికారులు వరద ప్రవాహాంపై క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు.