News March 20, 2024
SKLM: రైల్వే స్టేషన్‌లో మహిళకు తీవ్ర గాయాలు

ఆముదాలవలసలో గల శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ఓ కార్మికుడు డ్రిల్లింగ్ మిషన్‌ను ఆపకుండా వదిలేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడంతో ఆ డ్రిల్లింగ్ మిషన్ ప్లాట్‌ఫామ్ పై ఓ ప్రయాణికురాలి కాలుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే కాలు విరగడంతో 108లో ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 19, 2026
శ్రీకాకుళం: అసలు సూత్రధారులెవరో..?

ఈ ఏడాది రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసుల వ్యవహారం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. వీటి ముద్రణలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి<<19679785>> ఆరుగురిపై<<>> కేసు నమోదు చేశారు. అసలు ఈ పాసులను ముద్రించమన్నదెవరూ? ఇవి బయటికెలా వచ్చాయనే విషయాలను వెల్లడించకపోవడంతో అసలు నిందితులను రాజకీయ ఒత్తిడితో దాచిపెట్టారనే ఆరోపణలోస్తున్నాయి. తెర వెనక పాత్రదారులను పట్టుకోవాలని భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
News April 19, 2026
శ్రీకాకుళం: ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ప్రభుత్వం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో మార్కులు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇంప్రూవ్మెంట్ కట్టుకునే వెసులు బాటును ఈ ఏడాది నుంచి ప్రారంభించింది. శ్రీకాకుళం జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో 73 శాతం ఫలితాలు వచ్చాయి. 17,355 మంది పరీక్ష రాయిగా 12,684 ఉత్తీర్ణత సాధించారు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
News April 19, 2026
మెళియాపుట్టి: భర్త చితికి నిప్పుపెట్టిన భార్య

ఇంటి యజమాని మృతి చెందిన బాధను దిగమింగుతూ భార్య, భర్తకు తలకొరివి పెట్టిన ఘటన మెళియాపుట్టి(మ) చాపరలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు..చాపరలో నివసిస్తున్న కృష్ణ(52) పెట్రోల్ బంక్‌లో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం బారిన పడగా..శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశాడు. పిల్లలు చిన్నవారు కాగా..భర్త మరణంతో కన్నీరుమున్నీరువుతూ ఆయన చితికి భార్య నిప్పుపెట్టింది.


