News February 6, 2025

SKLM: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

image

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్సై సందీప్ వివరాల మేరకు.. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని చౌదరి సత్యనారాయణ కాలనీకి చెందిన తరుణ్ (19), పాజిల్ బేగ్ పేటకు చెందిన కార్తీక్ (21) బైక్‌పై వస్తూ డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Similar News

News January 4, 2026

శ్రీకాకుళం: రైల్వే ప్రయాణికులకు అలర్ట్ ..

image

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఖుర్ధా రోడ్ డివిజన్ పరిధిలో భద్రతకు సంబంధించిన మరమ్మతు పనులు కారణంగా పలాస-భువనేశ్వర్-పలాస(68419/20) మధ్య నడిచే మెము రైలును ఈనెల 4, 5, 6, 7, 8వ తేదీలలో రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ వెల్లడించింది. ఈ రైలు ఇచ్ఛాపురం, సోంపేట, బారువ, మందస, పలాస రైల్వే స్టేషన్లలో ఆగేది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News January 4, 2026

శ్రీకాకుళం: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

image

AP KGBV ఔట్‌సోర్సింగ్‌లో <<18747556>>పోస్టుల్లో<<>> శ్రీకాకుళం (D)కు టైప్-3లో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-3, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-9, ANM-8, అకౌంటడ్-1, అటెండెర్-2, హెడ్ కుక్-1, ASST కుక్-1, డే వాచ్ ఉమెన్-2, నైట్ వాచ్ ఉమెన్-1,స్కావెంజర్-2 ఉండగా..టైప్-4లో వార్డెన్-3,పార్ట్ టైమ్ టీచర్-6, చౌకిదార్-4, హెడ్ కుక్-3 ASST కుక్-11 ఉన్నాయి. 18ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే అర్హులు. ఈనెల 11లోపు APC ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి.