News August 7, 2024
SKLM: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

శ్రీకాకుళం జిల్లాలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. LNపేట మండలం మోదుగువలస నిర్వాసితకాలనీ చిన్నకొల్లివలసకు చెందిన బి.చిన్నారావు, శ్రీకాంత్ పెద్దపాడులోని స్నేహితుడి ఇంటికి వెళ్లారు. తిరిగి బైకుపై ఇంటికి బయల్దేరారు. ఆమదాలవలస ఓయోడెక్టు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డారు. శ్రీకాకుళం రిమ్స్‌లో చిన్నారావు మృతిచెందగా.. శ్రీకాంత్ చికిత్స పొందుతున్నాడు.
Similar News
News November 14, 2025
SKLM: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తాం

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తామని ఏపీ మాదిగ వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. NSFC కింద 450 రుణాలుకు 3 వేల దరఖాస్తులందయాని ఆమె వివరించారు. రూ 1.80 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని త్వరలో ఎంపిక చేసి రుణాలు ఇస్తామన్నారు. అధికారులు గడ్డమ్మ సుజాత పాల్గొన్నారు.
News November 13, 2025
ఎచ్చెర్ల: ఎనిమిది మంది విద్యార్థులు సస్పెండ్

రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఎస్.ఎం.పురం క్యాంపస్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థి మృతికి క్యాంపస్‌లో చదువుతున్న 8 మంది స్టూడెంట్స్ కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కుటుంబీకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా..8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూనివర్సిటీ యాజమాన్యం వీరిని సస్పెండ్ చేసింది.
News November 13, 2025
మస్కట్‌లో సిక్కోలు యువతి అనుమానాస్పద మృతి

ఆమదాలవలస మండలం వెదుర్లువలసకి చెందిన నాగమణి (28) జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె వారం రోజుల క్రితం ఇంటికి ఫోన్ చేసి అక్కడ తనను వేధిస్తున్నారని చెప్పిందని, ఇంతలోనే ఏజెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పినట్లు ఆమె తల్లి తెలిపారు.MLA రవికుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.


