News October 18, 2024

SKLM: వాటికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి- కలెక్టర్

image

బాలల సంరక్షణ కేంద్రాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాలల రక్షిత గృహాల నిర్వహణపై ఆయన సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాలు నిబంధనలు మేరకు నడపాలని సూచించారు. 

Similar News

News October 18, 2024

శ్రీకాకుళం: ఇద్దరిని హత్య చేసి, వ్యక్తి సూసైడ్

image

శ్రీకాకుళం జిల్లా వాసులు ముగ్గురు బెంగళూరులో మృతి చెందారు. పోలీసుల కథనం..గొల్లబాబు(45), లక్ష్మి పైతమ్మ (40) భార్యాభర్తలు బెంగళూరులో భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారు. వీరితో పాటు గణేశ్ (20) ఓ బిల్డింగ్‌లో పనికి దిగారు. గణేశ్‌తో పైతమ్మకు వివాహేతర సంబంధం ఉందని గొల్లబాబు బుధవారం రాత్రి ఇరువురిని హత్య చేశాడు. గురువారం ఉదయం అతను ఉరేసుకుని చనిపోయాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ లోకేశ్ తెలిపారు.

News October 18, 2024

సరసమైన ధరలకే వంట నూనె: జాయింట్ కలెక్టర్

image

ఇటీవల బహిరంగ మార్కెట్‌లో వంట నూనె ధరలు పెరిగినందున సామాన్య ప్రజలకు వంట నూనె ధరలు సరసమైన ధరలకు అందజేస్తామని జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పామోలిన్ ఆయిల్ 1లీ రూ.110/-, సన్ ఫ్లవర్ ఆయిల్ 1లీ రూ.124/- విక్రయించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 84 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆ కౌంటర్ల వద్దకు వెళ్లి తక్కువ ధరలో నూనె ప్యాకెట్లను తీసుకోవాలన్నారు.

News October 17, 2024

శ్రీకాకుళం: అలాంటి వారిపై చర్యలు తీసుకోండి 

image

శ్రీకాకుళం జిల్లాలో 11 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 13 బాలల సంరక్షణ కేంద్రాలు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ లేకుండా బాలల సంరక్షణ కేంద్రాలు నిర్వహించే కేంద్రాలపై కేసు నమోదు చేయాలన్నారు. అనుమతులు లేని బాలల సంరక్షణ కేంద్రాలను తక్షణమే మూయించాలని ఆదేశించారు.