News March 29, 2024
SKLM: వాట్సప్‌లో మెసేజ్ ఫార్వర్డ్.. టీచర్‌కు షోకాజ్ నోటీస్

సారవకోటలో పెద్దలంబ పంచాయతీ మూగుపురంలో టీచర్‌గా పనిచేస్తున్న చౌదరి లక్ష్మీనారాయణ ఎన్నికలు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు ఎంఈఓ మడ్డు వెంకటరమణ తెలిపారు. లక్ష్మీనారాయణ ఉపాధ్యాయ పనిచేస్తూ పాతపట్నం నియోజకవర్గం ఆదివాసి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయమని తన వాట్సాప్‌లో ప్రచారం చేసినట్లు కొంతమంది నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీస్ ఇచ్చామన్నారు.
Similar News
News November 23, 2025
ఈ అంబులెన్స్ ప్రజా సేవకు అంకితం: కలెక్టర్

కొత్తగా కొనుగోలు చేసిన ఆంబులెన్స్‌ను ప్రజాసేవకు అంకితం చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కొత్త ఆంబులెన్స్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఆంబులెన్స్ పాడైపోవడంతో ఆ సంస్థ ఛైర్మన్ జగన్మోహన్రావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త వాహనానికి రూ. 19.54 లక్షలు విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News November 22, 2025
మందస: లారీ ఢీకొని ఒకరు మృతి

లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మందస మండలం బాలిగాం బ్రిడ్జి సమీపాన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పలాస నుంచి ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై గుడ్లు లోడుతో వెళ్తున్న లారీ బాలిగాం బ్రిడ్జ్ సమీపాన బైక్‌ను ఢీకొంది. క్షతగాత్రుడికి తీవ్ర గాయలవ్వగా హరిపురం సీహెచ్‌సీకి తరలిస్తుండగా మరణించాడు. మృతుడు శాసనం గ్రామానికి చెందిన ధర్మారావు(45)గా సమాచారం. పోలీసు కేసు నమోదైంది.