News September 10, 2024
SKLM: విపత్తు నిర్వహణ బృందంలో చేరుటకు ఆహ్వానం

రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా విపత్తు నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తోందని సేవ చేయాలనుకునే వారు చేరవచ్చని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. పేర్లు నమోదు చేసు కున్న వారికి శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు విపత్తుల సమయంలో సేవ చేయాల్సి ఉంటుందని చెప్పారు. వివరాలకు 99486 33398, 90102 73741, 99633 99455 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Similar News
News December 10, 2025
ఇండిగో సంక్షోభంపై సిక్కోలు నేతలు మౌనం

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.
News December 10, 2025
శ్రీకాకుళం మహిళ దారుణ హత్య

పెందుర్తిలోని సుజాతనగర్‌లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, శ్రీనివాస్ సుజాతనగర్‌లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల శ్రీనివాస్ రైస్ పుల్లింగ్ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.
News December 10, 2025
శ్రీకాకుళం: ‘లక్ష్యాల సాధనలో ఆయా శాఖలు వేగం పెంచాలి’

ప్రభుత్వ శాఖల పనితీరులో వేగం పెంచి, కీలక పనితీరు సూచికలు ఆధారంగా లక్ష్యాలను సమయపాలనతో పూర్తి చేయాలని
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన శాఖల వారీగా సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. కేపీఐ ఆధారంగానే శాఖల పనితీరు మూల్యాంకనం జరుగుతుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి తావులేదన్నారు.


