News April 2, 2025
SKLM: వివరాలు తెలిపిన వ్యక్తికి బహుమతి

జలుమూరు మండలంలో మార్చి 29వ తేదీ రాత్రి వివిధ ఆలయాల గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాతలు రాశారు. ఈ మేరకు స్పందించిన ఎస్పీ, రాతలకు సంబంధించిన వ్యక్తుల వివరాలు తెలియజేసిన వారికి రూ. 25వేల నగదు పురస్కారం బహుమతిగా ఇస్తామని మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు తెలియజేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.
Similar News
News April 22, 2025
జలుమూరు: నాడు IPS.. నేడు IAS

జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేశ్ 2023 సర్వీసెస్ ఫలితాలలో 467 ర్యాంక్ సాధించి IPSకు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. అయితే IAS కావాలనే సంకల్పంతో వెంకటేశ్ మళ్లీ సివిల్స్ పరీక్షలు రాశాడు. మంగళవారం విడుదలైన సర్వీసెస్ ఫలితాలలో 15వ ర్యాంక్‌తో ఐఏఎస్ సాధించాడు. దీంతో వెంకటేశ్ తల్లిదండ్రులు చందర్రావు, రోహిణి అనందం వ్యక్తం చేశారు. వెంకటేశ్‌ని పలువురు అభినందించారు.
News April 22, 2025
SKLM: సకల జీవులకు ప్రాణాధారం ధరణి

భూమాత కన్నతల్లితో సమానమని ఎన్ని జన్మలు ఎత్తినా కన్నతల్లి బుణం తీర్చలేమని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుడమి తల్లి ఆయుస్సును పెంచేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
News April 22, 2025
శ్రీకాకుళం: లారీ వెనుక భాగం ఢీకొని YSR విగ్రహం ధ్వంసం

రూరల్ మండలంలోని బైరి జంక్షన్‌లో వైఎస్ఆర్ విగ్రహం లారీ వెనుక భాగం ఢీకొనడంతో విధ్వంసానికి గురైందని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సోమవారం నరసన్నపేట నుంచి బైరి జంక్షన్ చేరుకున్న లారీ గంగమ్మ మోడ్రన్ రైస్ మిల్‌కు వెళ్తూ లారీని వెనుకకు తీసే క్రమంలో విగ్రహానికి ఢీకొంది.