News February 11, 2026

SKLM: శైవ క్షేత్రాలకు RTC స్పెషల్ బస్సులు

image

15న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం APSRTC రీజియన్ పరిధిలో అన్ని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనారాయణ బుధవారం తెలిపారు. PSA డిపో నుంచి సాబకోటకు 10, TKL డిపో నుంచి రావివలసకు 5, SKLM-2 డిపో నుంచి రామతీర్థం 15 బస్సులు, 18న జరగనున్న శ్రీముఖలింగం చక్రతీర్థ స్నానమహోత్సవానికి 2వ డిపో నుంచి 10, TKL 5 నుంచి బస్సులు నడుపుతామన్నారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.