News February 2, 2025

SKLM: సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభం

image

అర‌స‌వ‌ల్లి శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామి ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు ఆదివారం ఉదయం సూర్య నమస్కారాలతో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణ, సూచనల మేరకు శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సుమారు 5000 మందితో ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. 12 రకాల ఆసనాలు వివరిస్తూ అందరితో చేయించారు. సూర్య నమస్కారం రెగ్యులర్ అభ్యాసం మెరుగైన మానసిక స్పష్టత వస్తుందన్నారు.

Similar News

News October 21, 2025

కవిటి: ఆ గ్రామం ఆదర్శం..!

image

కవిటి (M) పొందూరు పుట్టుగ గ్రామం దీపావళి పండగకు దూరంగా ఉంది. కారణం ఏమిటంటే..? ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు దూగాన రామ్మూర్తి (44), ప్రణయ్ (17) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి నాడు బాధిత కుటుంబంలో అమావాస్య చీకట్లు అల్లుకున్నాయని గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News October 21, 2025

ఎంపీ కలిశెట్టి దీపావళి వేడుకలు భళా

image

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలం ప్రభుత్వ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు స్వీట్స్ పంచి వారితో బాణాసంచా కాల్చారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బాలికలతో ఇలా దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

News October 21, 2025

శ్రీకాకుళం: ‘RTCలో 302 మందికి ప్రమోషన్లు’

image

శ్రీకాకుళం APRTC డివిజన్ పరిధిలో 23 కేటగిరిల్లో విధులు నిర్వహిస్తున్న 302 మందికి ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదివారం, సోమవారం ప్రమోషన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. రెండు, మూడు రోజుల్లో జాబితా ప్రకటిస్తామని ఆయన వివరించారు.