News February 2, 2025
SKLM: సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఆదివారం ఉదయం సూర్య నమస్కారాలతో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణ, సూచనల మేరకు శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సుమారు 5000 మందితో ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. 12 రకాల ఆసనాలు వివరిస్తూ అందరితో చేయించారు. సూర్య నమస్కారం రెగ్యులర్ అభ్యాసం మెరుగైన మానసిక స్పష్టత వస్తుందన్నారు.
Similar News
News July 9, 2025
శ్రీకాకుళం: 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం

శ్రీకాకుళం జిల్లాలో 22 పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు)కు ఛైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో 36 పీఏసీఎస్ సంఘాలు ఉండగా 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం పూర్తయింది. వీరు వచ్చే ఏడాది జూలై 30వ తేదీ వరకు కొనసాగుతారు. ఒక పీఏసీఎస్ సంఘానికి ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించారు.
News July 9, 2025
హత్యాయత్నం కేసులో నిందితుడికి నాలుగేళ్లు జైలు: ఎస్పీ

మందస పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైన హత్యాయత్నం, గృహహింస కేసులో నిందితుడికి 4 ఏళ్లు జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. మందసకు చెందిన సూర్యారావు తన భార్య నిర్మలపై హత్యాయత్నం చేశాడు. నేరం రుజువైనందున అసిస్టెంట్ సెషన్ సోంపేట కోర్టు జడ్జి శిక్ష ఖరారు చేసినట్లు వివరించారు.
News July 9, 2025
రేపు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ డ్రైవ్

శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు, ఇంటెల్లిరేస్ సీఈఓ ఆర్. నరేంద్ర మంగళవారం తెలిపారు. ఈ మేళాలో పాల్గొనే వారు డిప్లొమా, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, బి.టెక్ విద్యార్హత ఉండాలన్నారు. 28 ఏళ్ల లోపు ఉన్న యువతి, యువకులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న యువత సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో మేళాలో పాల్గొనాలని కోరారు.