News April 1, 2025
SKLM: హెడ్ కానిస్టేబుల్‌ను సత్కరించిన జిల్లా ఎస్పీ

శ్రీకాకుళం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో సుమారు 41సంవత్సరాలు పాటు హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసిన పి. కృష్ణమూర్తి మార్చి 31న (సోమవారం) ఉద్యోగ విరమణ చెందారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కృష్ణమూర్తికి శాలువా, పూల దండతో సత్కరించారు. అనంతరం జ్ఞాపికను ప్రధానం చేసి పోలీస్ అధికారుల సమక్షంలో ఆత్మీయ వీడ్కోలు పలికారు.
Similar News
News April 8, 2025
శ్రీకాకుళం: ఆక్వా రైతులపై మరో పిడుగు

ఇప్పటికే ఆక్వా ఫీడ్, సీడ్ ధరలు పెరగడంతో కుదేలైన ఆక్వా రైతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపంలో మరో పిడుగు పడింది. దిగుమతి సుంకాలు 27శాతానికి పెంచడంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై పన్ను భారం పడింది. ఈ దెబ్బతో రైతుకి ధర తగ్గిపోయింది. జిల్లా నుంచి ఎక్కువ శాతం అమెరికాకే ఎగుమతి అవుతుండగా.. 4వేల హెక్టార్లలో సాగు జరుగుతోంది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వేల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.
News April 8, 2025
శ్రీకాకుళం: ‘ఆధార్ సేవలను వినియోగించుకోండి’

జిల్లా ప్రజలందరికీ ఆధార్ సేవలు సులభంగా అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలోని 732 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి 5 సచివాలయాలకు ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 146 ఆధార్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
News April 8, 2025
SKLM: ‘అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు’

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను చట్ట పరిధిలో ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులకు ఎండార్స్ చేసి పరిష్కరించాలని చెప్పారు.