News September 17, 2024
SKLM: హెల్మెట్ లేకుంటే రూ.1035 ఫైన్

బైకు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని.. లేకుంటే ఫైన్ వేస్తామని శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ నాగరాజు హెచ్చరించారు. నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని సూచించారు. హెల్మెట్ లేకుంటే రోడ్లపైకి వస్తే రూ.1035 ఫైన్ వేస్తామని హెచ్చరించారు.
Similar News
News September 14, 2025
శ్రీకాకుళం డీఈఓగా రవిబాబు

శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారిగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శనివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. DEO కార్యాలయంలో ADగా పనిచేస్తున్న రవిబాబును ఇప్పటివరకు ఇన్ఛార్జి DEOగా కొనసాగారు. జిల్లాలో విద్యా శాఖ అభివృద్ధికి అధికారుల సహాయంతో ముందడుగు వేస్తానని ఆయన అన్నారు.
News September 14, 2025
శ్రీకాకుళం: ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి

ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తే వస్తువులు, నగదు పొగోట్టుకునే అవకాశం తక్కువుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటే సామగ్రిని కాపాడుకోవచ్చు. ఇలాంటి చేదు అనుభవం శనివారం ఓ ప్రయాణికుడికి ఎదురైంది. శ్రీకాకుళంలోని టీసీబీకాలనీకి చెందిన ప్రణీత్ ఆర్టీసీ బస్సులో ఫోన్ మర్చిపోయి ఇంటికెళ్లి కాల్ చేశాడు. డ్రైవర్, కండక్టర్ వద్ద ఫోన్ సురక్షితంగా ఉందని తెలిసి సంతోషించాడు. అనంతరం బాధితుడికి మొబైల్ ఇచ్చారు.
News September 14, 2025
శ్రీకాకుళం: కొత్తమ్మ జాతరలో వీడియో పోటీలు

కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. అమ్మవారి చరిత్ర, తదితర విషయాలను వీడియో రూపంలో చూపేందుకు పోటీలు నిర్వహించనున్నట్లు DRO వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. వీడియో 3 నుంచి 5 నిమిషాల నిడివితో పాటు ఆకర్షణగా ఉండలాని చెప్పారు. 16 తేదీ లోపు dsdosrikakulam@apssdc.in కు వీడియోలను పంపాలని ఆయన పేర్కొన్నారు.