News April 11, 2025

SKLM: అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతీరావు ఫూలే

image

అణగారిన వర్గాల అభ్యున్నతి కి కృషి చేసి, పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి కొనియాడారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సంఘ సంస్కరణ ఉద్యమంలో ఫూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారన్నారు. సంస్కరణోద్యమంగా పేరుగాంచి కుల మత వర్ణ విబేధాలకు స్వస్తి పలికారన్నారు.

Similar News

News September 12, 2025

SKLM: రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

image

రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు పలువురు రైతులు ఫోన్ చేసి తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. రైతుల వివిధ రకాల సమస్యలను తెలుసుకుని సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు రైతులకు కాన్ఫరెన్స్ ఫోన్ కాల్‌కి తీసుకొని ఎరువులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

News September 11, 2025

నేపాల్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న సిక్కోలు వాసులు

image

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు గురువారం సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా వాసులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు చొరవతో జిల్లా వాసులను క్షేమంగా తీసుకురాగలిగామన్నారు.

News September 11, 2025

ఎల్.ఎన్.పేట: పాముకాటుతో వ్యక్తి మృతి

image

ఎల్.ఎన్.పేట మండలం బసవరాజుపేట గ్రామానికి చెందిన వాన అప్పలనాయుడు (45) పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గురువారం పొలంలో ఎరువులు వేస్తున్న సమయంలో కాలుకి పాము చుట్టుకుని కాటు వేసింది. పాము కాటును గుర్తించిన అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.