News April 8, 2025
SKLM: ‘అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు’

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను చట్ట పరిధిలో ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులకు ఎండార్స్ చేసి పరిష్కరించాలని చెప్పారు.
Similar News
News April 13, 2025
SKLM: ‘కోర్టు విధుల్లో సిబ్బంది ప్రతిభ చూపాలి’

కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కోర్టు విధుల్లో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు ప్రతిభ కనబర్చాలని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి కోర్టు లైజనింగ్ అధికారులకు సూచించారు. శనివారం కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకమని ఎస్పీ అన్నారు. వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలను ఎస్పీకి సిబ్బంది వివరించారు.
News April 12, 2025
SKLM: ఎస్సీలకు రూ.18.74 కోట్ల ప్రోత్సాహం

ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 కింద శ్రీకాకుళం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 450 మంది లబ్ధిదారులకు రూ.18.74 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
News April 12, 2025
శ్రీకాకుళం జిల్లాకు 23వ స్థానం

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 16,926 మంది పరీక్షలు రాయగా 12,532 మంది పాసయ్యారు. 74 శాతం పాస్ పర్సంటేజీతో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే 23 వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 18,574 మందికి 11,733 మంది పాసయ్యారు. 63శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలిచింది.