News February 19, 2025
SKLM: ‘ఆవుపాలు ధర పెంచాలి’

తగ్గించిన ఆవుపాలు ధర పెంచాలని.. కనీస వెన్న శాతాన్ని 2.8 శాతం నుంచి 3.1 శాతానికి పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని రైతు సంఘ కార్యాలయంలో బుధవారం పాల రైతులతో సమావేశం జరిగింది. 30 లీటర్ల కంటే తక్కువ పాలు పోసిన సెంటర్లను ఆపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
Similar News
News February 21, 2025
అచ్చెన్న అబద్ధాలు చెప్పడం తగదు: ధర్మాన కృష్ణ దాస్

వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని శాఖలకు మంత్రి స్థానంలో ఉండి అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పడం తగదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక సతమతం అవుతుంటే గత ప్రభుత్వంలో రేటు పలికిందా? అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.
News February 21, 2025
శ్రీకాకుళంలో ఇంటర్నేషనల్ రెడ్ బుక్ డే

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపించేది కమ్యూనిస్టు ప్రణాళికని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, బి.కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు అధ్యక్షతన ఇంటర్నేషనల్ రెడ్ బుక్ డే నిర్వహించారు. లెనిన్ రాసిన గ్రంథాన్ని అధ్యాయం చేయాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు.
News February 21, 2025
మందస: విద్యార్థిని ఆత్మహత్యపై కేసు నమోదు

మందస మండలం లోహరిబందలో ఇటీవల ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఎస్.ఐ కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేసినట్లు గురువారం తెలిపారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వచ్చి జీడీ తోటలోకి వెళ్లి చెట్టు కొమ్మకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మండలంలో కలకలం రేపింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.