News February 20, 2025

SKLM: ఆశా వర్కర్ల శిక్షణాసదస్సు పూర్తి

image

శ్రీకాకుళం జిల్లా DM&HO కార్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్(IGD) ఆధ్వర్యంలో అయోడిన్ లోపంపై ఆశావర్కర్లతో జరుగుతున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఆశా వర్కర్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ ప్రశంసా పత్రాలను అందించారు. ఆశా కోఆర్డినేటర్ రవిప్రసాద్, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేశ్ కుమార్ ఉన్నారు.

Similar News

News February 22, 2025

శ్రీకాకుళం: జిల్లాను ప్రగతి పథంలో తీసుకువెళ్లాలి

image

జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో 2వ, 4వ, 7వ స్థాయి సంఘాల సమావేశం జరిగింది. జిల్లా అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు హాజరయ్యారు.

News February 21, 2025

SKLM: వయసు 23.. 12 దొంగతనం కేసులు

image

శ్రీకాకుళంలో గంజాయితో శుక్రవారం నలుగురు యువకులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చదువుపై దృష్టిని సారించాల్సిన యువకులు తప్పటడుగులు వేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. అరెస్టయిన వారిలో ధర్మాన ప్రవీణ్(23)పై ఏకంగా 12 దొంగతనం కేసులు ఉన్నాయి. ఇటీవల జైలుకు వెళ్లొచ్చాడు. యోగేశ్వర రావు, జలగడుగుల తార వికాస్‌పై గతంలో గంజాయి కేసులు ఉండటంతో జైలుకెళ్లారు.

News February 21, 2025

అచ్చెన్న అబద్ధాలు చెప్పడం తగదు: ధర్మాన కృష్ణ దాస్

image

వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని శాఖలకు మంత్రి స్థానంలో ఉండి అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పడం తగదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక సతమతం అవుతుంటే గత ప్రభుత్వంలో రేటు పలికిందా? అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.

error: Content is protected !!