News October 3, 2025
SKLM: ఇద్దరు మృతి.. రూ.8 లక్షల పరిహారం

భారీ వర్షాలకు మందస మండలం టుబ్బూరులో మట్టి గోడ కూలి భార్యాభర్తలు సవర బుడియా, రూపమ్మ <<17900358>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. సీఎం చంద్రబాబుకు జరిగిన విషయాన్ని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల చొప్పున రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు త్వరలో చెక్కులు అందజేయనున్నారు.
Similar News
News October 3, 2025
కలెక్టర్లతో CM వీడియో కాన్ఫ్‌రెన్స్

బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాగావళి, వంశధార వంటి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సీఎం చెప్పారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ..ఇక్కడున్న నదుల వలన ఎటువంటి ఇబ్బందిలేదని, గొట్టబ్యారేజ్ కి 1.4 లక్షల నీరు చేరిందని వివరించారు. JC ఇతర అధికారులు ఉన్నారు.
News October 3, 2025
శ్రీకాకుళం: మునిగిన రోడ్డు.. సాహసం చేశారు!

భారీ వర్షాలకు నందిగామ మండలం ఉయ్యాలపేట వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. ఆ గ్రామానికి 108 అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు సాహసం చేశారు. కర్రకు డోలీ కట్టి మెయిన్ రోడ్డు వరకు ఆయనను మోసుకెళ్లారు.
News October 3, 2025
శ్రీకాకుళం: 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 3వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. నదిలో ప్రస్తుతం 1,04,891 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు హెచ్చరికలను గమనించాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే కలెక్టర్ కార్యాలయంలోని టోల్ ఫ్రీ నంబర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు.