News November 3, 2024

SKLM: ఇరిగేషన్.. ఇండస్ట్రీ.. ఇదే మా నినాదం: మంత్రి

image

వలసలను నివారించడమే ధ్యేయంగా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట పోర్టులను అనుసంధానిస్తూ కోస్టల్ కారిడార్ నిర్మాణానికి డిపిఆర్‌లు రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లా అభివృద్ధిపై గతంలో ఏ సీఎం కూడా జిల్లా అధికారులతో రివ్యూ చేసింది లేదన్నారు.

Similar News

News March 2, 2026

SKLM: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి..ఇతను మీకు తెలుసా?

image

టెక్కలిలోని మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ఆవరణలో సోమవారం విద్యుత్ షాక్‌తో గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. పాఠశాల సమీపంలోని రహదారిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో పక్కనే ఉన్న కాలువపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని టెక్కలి ఎస్ఐ కె.రాము పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా ప్రమాదవ శాత్తు జరిగిందా? తెలియాల్సి ఉంది.

News March 2, 2026

శ్రీకాకుళం: 214కు చేరుకున్న డయేరియా కేసులు

image

శ్రీకాకుళం నగరంలో గత నెల 23 నుంచి ఆదివారం వరకు 214 డయేరియా కేసులు నమోదయినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. మొత్తం 116 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 94 మంది ఉన్నారని వెల్లడించారు. ఆదివారం నలుగురు ఆసుపత్రిలో చేరారని తెలిపారు. డయేరియా అదుపులో ఉందని, అధికారుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు.

News March 2, 2026

SKKM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

image

మార్చి 2న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగాపై కార్యక్రమంలో, ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీల స్థాయిని తెలుసుకోవచ్చు అన్నారు.