News February 5, 2026

SKLM: ఈ -ఆటోలను ప్రారంభించిన కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా పంపిణీ జరిగిన 8 ఎలక్ట్రానిక్ వాహనాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆయన కార్యాలయం ఆవరణలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ..పరిశుభ్రతను పాటించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధానమైన పరిశుభ్రతపై అధికారులు, సిబ్బంది బాధ్యత వహించి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సౌజన్య, తదితరులున్నారు.

Similar News

News February 21, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

✯టెక్కలి: చోరీ కేసుల్లో పాత నేరస్థుడి అరెస్ట్
✯క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది: ఎమ్మెల్యే కూన
✯బూర్జ: ఘోర అగ్నిప్రమాదం.. 50 ఎకరాల్లో ఆస్తి నష్టం
✯శ్రీకాకుళం: మహిళ కడుపులో నుంచి 3.3 కిలోల కణితి తొలగింపు
✯శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలు ఎంత మంది రాయనున్నారంటే?
✯జిల్లాలో పలుచోట్ల అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం

News February 21, 2026

ఆమదాలవలస: అస్వస్థతకు గురై ప్రయాణికుడు మృతి

image

శ్రీకాకుళం నుంచి పాలకొండకు బస్సులో వెళ్తున్న ప్రయాణికుడు శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. చింతాడ వద్ద బస్సును ఆపి తోటివారు, సిబ్బంది 108కు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్ అక్కడికి చేరుకొని ప్రయాణికుడిని 108 సిబ్బంది పరీక్షించగా అప్పటికే మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 21, 2026

ఎచ్చెర్ల: ఫలితాలు విడుదల

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు యూజీ పరీక్షల విభాగం డీన్ ఎం. అనురాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీబీ, సీఏ. బీబీఏ, బీటెక్ పరీక్షలు సంబంధించి రిజల్ట్ యూనివర్సిటీ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, వర్సిటీ వెబ్‌సైట్ ఫలితాలను విద్యార్థులు చూడవచ్చని అన్నారు.