News March 24, 2025
SKLM: ‘ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షకు 39946 మంది హాజరు’

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆదివారం జరిగిన ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షకు 39,946 మంది హాజరయ్యారు. ఈ విషయాన్ని డీఆర్డీఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ పెద్దింటి కిరణ్ కుమార్ తెలిపారు. తొలుత అన్ని మండలాల్లోని ఏరియా కోఆర్డినేటర్లు ఏపీఎంలు ఆయా అభ్యర్థులు పేర్లు నమోదు చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వం పటిష్ఠంగా చేపడుతున్న వయోజనులకు అక్షరాస్యత కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.
Similar News
News March 26, 2025
సీఎం రివ్యూ మీటింగ్‌లో శ్రీకాకుళం కలెక్టర్, ఎస్పీ

అమరావతిలో మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన అంశాలపై నివేదికలు సమర్పించారు. అలాగే జిల్లాకు అవసరమైన అభివృద్ధి పథకాల గురించి వివరించారు.
News March 25, 2025
SKLM: కరెంట్ షాక్‌తో అటెండర్ మృతి

శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వెనుక ఉన్న గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు (46) మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కార్యాలయం ఆవరణలో మోటారు వేసేందుకు వెళ్లిన ఆయన షార్ట్ సర్క్యూట్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.
News March 25, 2025
ఉద్దానంలో ఆకట్టుకున్న ‘ప్రేమ’ పనసకాయ

వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం ఉద్దానం గ్రామంలో ఒక పనసచెట్టుకు కాచిన పనసకాయ LOVE ఆకారంలో ఉండటం చూపరులను ఆకట్టుకుంటుంది. గ్రామానికి చెందిన ఒక రైతుకు చెందిన చెట్టుకు ఈ అరుదైన కాయ కాసింది. కాగా ప్రస్తుతం ఈ ఫొటోను గ్రామస్థులు, యువత సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానంలో ప్రేమ పనస అంటూ ఫొటోను SHARE చేస్తున్నారు.