News April 23, 2025
SKLM: ఐఏఎస్‌గా ఎంపికైన యువకుడికి కేంద్రమంత్రి అభినందన

ఈ ఏడాది UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా యువకుడు బన్న వెంకటేశ్ ఆల్ ఇండియా 15వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయనను ఫోన్‌లో అభినందించారు. వెంకటేశ్ తండ్రితో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకి గర్వకారణంగా ఉందని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలన్నారు.
Similar News
News February 24, 2026
శ్రీకాకుళంలో 76కి పైగా డయేరియా కేసులు

శ్రీకాకుళంలో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 76 వరకు బాధితులు ఉన్నారు. పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకోవడంతో జిల్లా యంత్రాంగం అలెర్ట్ అయింది. దీంతో రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వేకు 50 బృందాలు ఏర్పాటు చేశారు. లక్షణాలు ఉన్న వారి గుర్తింపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
News February 24, 2026
అదుపులో డయేరియా: శ్రీకాకుళం కలెక్టర్

శ్రీకాకుళం పట్టణ కేంద్రంలోని దమ్మలవీధి, గుడివీధి, మంగువారితోట, కాకివీధి ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫిబ్రవరి 23న కేసులు వెలుగుచూసిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, రెవెన్యూ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
News February 24, 2026
శ్రీకాకుళం: డయేరియా మృతుని కుటుంబానికి రూ.10 లక్షలు

శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో డయేరియాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు. మృతుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మెరుగైన వైద్యం, వైద్యుల నిరంతర పర్యవేక్షణ ఉండేవిధంగా ఆదేశాలిచ్చామన్నారు.


