News December 3, 2024

SKLM: ఒకే పులి మూడున్నరేళ్లుగా సంచారం 

image

పాతపట్నం పరిధిలోని చోడసముద్ర ప్రాంతంలో ఇటీవల పులి సంచారం విషయం తెలిసిందే. గడిచిన మూడున్నరేళ్లుగా ఇదే పులి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, ఒడిశా ప్రాంతాల్లోని అడవుల్లో సంచరిస్తోందని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్, సిబ్బంది గుర్తించారు. పులి అడుగుల జాడతో ఇదే పులి ఇక్కడ సంచరిస్తోందని నిర్ధారించారు. ప్రస్తుతం అటవీ సిబ్బంది పులి పాదముద్రలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Similar News

News February 24, 2026

శ్రీకాకుళం: జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల నిర్వహణ

image

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. అండర్-18 పురుషులు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేశ్ బాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలు ఈనెల 28న ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

News February 24, 2026

శ్రీకాకుళం: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలోని 71 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేష్ కుమార్ తెలిపారు. మొత్తం 19,158 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,840 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. 98.34 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు.

News February 24, 2026

శ్రీకాకుళం నాయకులతో లోకేశ్ ఆత్మీయ సమావేశం

image

మంగళగిరిలో ఐటి విద్యాశాఖ మంత్రి శ్రీకాకుళం నాయకులతో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వారి కుటుంబాలతో మంత్రి లోకేశ్ ఆత్మీయంగా మాట్లాడారు. వారికి కానుకలు అందజేశారు. యోగక్షేమాలు అడుగుతూ సరదాగా గడిపారు.