News August 19, 2025

SKLM: కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ పర్యవేక్షణ

image

శ్రీకాకుళం జిల్లాలోని మండల స్పెషల్ ఆఫీసర్స్‌తో నేరుగా ఫోన్‌లో కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ మాట్లాడారు. లోతట్టు ప్రాంతలు ప్రజలను అప్రమత్తం చేయాలని వారికి సూచించారు. ఇవాళ రాత్రి అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి సచివాలయంలో ఇద్దరు డ్యూటీలో ఉండాలని, పాటపట్నం,మెళియాపుట్టి, కంచిలి ప్రాంతాల్లో పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కంట్రోల్ రూమ్ డ్యూటీ‌లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News August 24, 2025

సోంపేట: తీరప్రాంత మహిళలు ఆర్థిక స్వావలంబనకు కూటమి కృషి

image

తీర ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. సోంపేట మండలం మూలపొలం గ్రామంలో, సముద్రపు నాచుసాగు పైలట్ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో శనివారం కలెక్టర్, స్థానిక మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ పద్ధతి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని సీఎం చెప్పారు. కలెక్టర్, మహిళలు ఇక్కడి పరిస్థితులను సీఎంకు వివరించారు.

News August 23, 2025

ప్రిన్సిపల్‌గా 12వ ర్యాంకు సాధించిన జి.సిగడాం వాసి

image

మెగా డీఎస్సీ – 2025 ఫలితాలలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బాలి అప్పలరాజుకు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా స్టేట్ 12వ ర్యాంకు సాధించారు. తాను ప్రస్తుతం జి. సిగడాం జెడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని తెలిపారు. అయితే విడుదలైన ఫలితాలలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ స్టేట్ 12వ ర్యాంకుతో పాటు పీజీటీగా స్టేట్ ఏడవ ర్యాంకు కూడా వచ్చిందన్నారు.

News August 23, 2025

నరసన్నపేట: వంశధార పేపర్ మిల్లు ప్రమాదంలో ఒకరు మృతి

image

నరసన్నపేట మండలం మడపాం వంశధార పేపర్ మిల్లులో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం మిల్లులో నిల్వ చేసిన టన్నుల ఊక ఒక్కసారిగా కార్మికుడు వాసు(45)పై పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఇదే గ్రామానికి చెందిన వాడిని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.