News October 10, 2025
SKLM: కత్తర్లో రూ.లక్ష ఇరవై వేలతో యువతకు ఉద్యోగాలు

కత్తర్లో రూ లక్ష ఇరవై వేలతో అర్హులైన యువతీ యువకులకు హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలు ప్రభుత్వం కల్పిస్తుందని మైనారిటీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమారస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం పూర్తి చేసి రెండేళ్లు అనుభవం ఉండాలని చెప్పారు. 21-40 ఏళ్లు ఉన్నవారు వెబ్ సైట్‌లో https://naipunyam.ap.gov.in/user-registration దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News October 11, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

✯సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే శంకర్
✯డయాలసిస్ సేవలు సకాలంలో అందించాలి: జడ్పీ చైర్‌పర్సన్
✯ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్యే కూన ఆగ్రహం
✯కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే అశోక్
✯ లక్ష్మీపురంలో కుక్కల స్వైరవిహారం
✯జిల్లాలో పలుచోట్ల సూపర్ జీఎస్టీపై అవగాహన
✯పొందూరు: భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి
News October 10, 2025
SKLM: ప్రయాణికులకు శుభవార్త

పంచరామ క్షేత్రాలకు శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి CH అప్పలనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట వెళ్లేందుకు రూ 2,400, 2,350లతో apsrtconline.inలో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.
News October 10, 2025
బూర్జ: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు

ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ యువకుడుపై బూర్జ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఎం.ప్రవల్లిక వివరాలు మేరకు.. బూర్జ మండలం ఓ గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లికి నిరకరించడంతో సదరు బాలిక ఫిర్యాదు మేరకు గురువారం ఆ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.