News March 25, 2025

SKLM: కరెంట్ షాక్‌తో అటెండర్ మృతి

image

శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వెనుక ఉన్న గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు (46) మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కార్యాలయం ఆవరణలో మోటారు వేసేందుకు వెళ్లిన ఆయన షార్ట్ సర్క్యూట్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.

Similar News

News March 28, 2025

SKLM: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

పలాస, శ్రీకాకుళం మీదుగా హైదరాబాద్(HYB)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07165 HYB- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

News March 28, 2025

శ్రీకాకుళం: బాలల హక్కుల కార్యదర్శి నియామకం

image

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మురపాక గ్రామానికి చెందిన వమరవెల్లి మణి బాబును జిల్లా బాలహక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శిగా శుక్రవారం రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదర్ నియమించారు. ఈ సందర్భంగా మణిబాబు మాట్లాడుతూ.. బాలల హక్కుల కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. బాల కార్మికులను గుర్తించడం, పాఠశాలల్లో డ్రాప్ ఔట్‌లను తగ్గించడం తన ప్రథమ కర్తవ్యం అని అన్నారు.

News March 28, 2025

SLM: పక్షుల రక్షణకు విద్యార్థుల వినూత్న ఆలోచన

image

పక్షుల రక్షణకు విద్యార్థులు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బూరగాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల, గ్రామాలలో పక్షుల కోసం ప్రత్యేకంగా తొట్టెలు, కొబ్బరి చిప్పల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎండకు స్పృహ తప్పి పడిపోయిన పక్షికి విద్యార్థులు నీరు తాగించి రక్షించారు. దీంతో పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

error: Content is protected !!