News February 23, 2025
SKLM: ‘కేసులు త్వరగా దర్యాప్తు చేయాలి’

గంజాయి అక్రమ రవాణా, ఇతర మాదక ద్రవ్యాల కేసుల్లో పటిష్ఠంగా దర్యాప్తు చేపట్టి శిక్షలు శాతం పెరిగేలా చేయాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. శనివారం ఎచ్చెర్లలోని ఓ ప్రైవేటు కళాశాలలో SKLM, VZM, మన్యం జిల్లాల పోలీసు అధికారులతో గంజాయి, కేసుల దర్యాప్తులో చట్టపరమైన నిబంధనలు, పాటించాల్సిన నియమాలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి, ఏఎస్పీ వెంకట రమణ ఉన్నారు.
Similar News
News February 23, 2025
నందిగం: ఉపాధ్యాయునిపై కేసు నమోదు

నందిగం మండలం దేవుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న కొండాల గోపాలం అనే 59 ఏళ్ల ఉపాధ్యాయుడిపై శనివారం కేసు నమోదు చేసినట్లు నందిగం ఎస్.ఐ మహమ్మద్ అలీ తెలిపారు. పాఠశాలలో 3వ తరగతి ఒక విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనపై శనివారం విద్యాశాఖ అధికారులు కూడా విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
News February 23, 2025
టెక్కలిలో రోడ్డు ప్రమాదం

టెక్కలి ఇందిరాగాంధీ కూడలి సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బూరగాం గ్రామానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఇందిరాగాంధీ కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీకొంది. స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
News February 22, 2025
పలాస: తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పద్మనాభపురం శివాజీ నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పరీక్షలు సమీపిస్తుండడంతో చదవమని తల్లి మందలించగా మనస్తాపం చెందిన యశ్వంత్ (17) ఉరేసుకున్నాడు. శనివారం విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.