News January 6, 2026
SKLM: క్రీడలు, మైదానాల అభివృద్ధి సహకరించండి

శ్రీకాకుళం జిల్లాలో క్రీడలు, మైదానాల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందివ్వాలని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. మంగళవారం ఆయనతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. పాత్రునివలస రెవెన్యూ పరిధిలో 33 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి ఆయనకు వివరించారు. మైదానాలు అభివృద్ధి చేయాలన్నారు.
Similar News
News January 8, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

▶అక్రమ గ్రావెల్ తవ్వకాలు సహించం: ఎమ్మెల్యే శిరీష
▶ఎల్.ఎన్ పేట: ఎరువులు అందక రైతుల ఆందోళన
▶పలాస: గంజాయితో నలుగురు వ్యక్తులు అరెస్ట్
▶వైసీపీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్‌గా తమ్మినేని కొనసాగింపు
▶టెక్కలి: చనిపోయిన పందులతో పరిశ్రమ ఎదుట నిరసన
▶సర్పంచ్‌పై దాడి.. ఎస్పీకి ధర్మాన కృష్ణచైతన్య ఫిర్యాదు
▶మందస: ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూములు ఇవ్వమని ప్రతిజ్ఞ
▶సోంపేట: రెచ్చిపోతున్న కోతుల గుంపులు
News January 7, 2026
శ్రీకాకుళం: యువకుడిపై పోక్సో కేసు.. రిమాండ్

శ్రీకాకుళం నగరానికి చెందిన నవీన్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శ్రీకాకుళం 1 టౌన్ ఎస్ఐ హరికృష్ణ మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News January 7, 2026
ఆగని భోగాపురం మంటలు.. మీ కామెంట్

భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ విషయంలో TDP, YCP నేతల మధ్య మాటల మంటలు ఆరడం లేదు. తమ ప్రభుత్వంలో విమానాశ్రయానికి పూర్తి అనుమతులు తెచ్చామని YCP నేతలు గట్టిగా చెప్తున్నారు. YCP హయాంలోనే 2,200 ఎకరాల్లోని అడ్డంకులు తొలగించి ప్రాజెక్టును పట్టాలెక్కించామంటున్నారు. ఈ వ్యాఖ్యలను TDP కొట్టిపారేస్తోంది. ఎర్ర బస్సు రాని గ్రామానికి ఎయిర్ బస్ తీసుకువచ్చిన ఘనత తమదని, ప్రాజెక్టును పూర్తి చేశామని అంటోంది.


